Thursday, July 29, 2010

లివర్‌ ఫ్రై, ఆనియన్‌ కర్రీ, కాకరకాయ పచ్చడి, కరివేపాకు రైస్

liver-fry

లివర్‌ ఫ్రైకావలసినవి...
చికెన్‌ లివర్‌ - పావుకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు
ఉల్లిగడ్డలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడినంత
కారం - అర చెంచా
మసాలా దినుసులు - చెక్క, లవంగ, యాలుక్కాయలు
పాలు - ఒక చిన్న గ్లాసు
నీళ్లు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడినంత

తయారు చేయు విధానం...
ముందుగా లివర్‌లో పాలు పోసుకోవాలి. ఒక పది నిమిషాల తరువాత పాలని వంచేయాలి. లివర్‌ను మంచి నీటితో కడుక్కోవాలి. తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒ చెంచా నూనె వేసుకుని కలుపుకోవాలి. తరువాత పొయ్యి మీద పాన్‌ పెట్టి లివర్‌ను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్ర పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. మసాల దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నీ మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొబ్బరి పొడి, కారం వేసి ఇంకొంచెం సేపు ఉంచాలి. కొద్దిగా నీటిని పోసి ఒక ఐదు నిమి షాలు ఆగాలి. తరువాత ఇందులో లివర్‌ ముక్కలువే యాలి. చివరిలో ఘరం మసాలా పొడి వేసుకోవాలి.

onion

ఆనియన్‌ కర్రీ

కావలసినవి :
ఆనియన్స్‌ - నాలుగు పెద్దవి
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడినంత
కారం - ఒక టీ స్పూన్‌
పచ్చిమిర్చి - రెండు
దనియా పౌడర్‌- అర చెంచ
గరం మసాలా - పావు టీ స్పూన్‌
పోపు గింజలు - ఒక టీ స్పూన్‌
ఆయిల్‌ - పోపుకు సరిపడింత
కొత్తిమీర - చిన్న కట్ట

తయారు చేసే విధానం...
ముందుగా ఆనియన్స్‌ని పొడుగ్గా సన్నగా కట్‌ చేసుకోవాలి. వాటిని విడి విడిగా విడదీయాలి. తరువాత పచ్చి మిర్చి కూడా చిన్నగా చీలికలుగా చేసుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి అందులో ఆయిల్‌ వేసుకోవాలి. పోపు గింజలు వేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ఆనియన్స్‌ వేసు కోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. తరు వాత పసుపు, కారం, దనియా పౌడర్‌ వేసి ఇంకో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తరువాత కొద్దిగా నీటిని వేసుకోవాలి. ఇగిరిపోయిన తరువా త చివరిగా గరం మసాలా పౌడర్‌ వేసుకోవాలి. రెండు నిమిషాలు ఉంచి దించుకోవాలి. దాన్ని కొత్తి మీరతో గార్నిష్‌ చేసుకోవచ్చు.

kakara

కాకరకాయ పచ్చడి
కావలసినవి....
కాకర కాయలు- పావుకిలో
ఉల్లిపాయలు- నాలుగు,
కారం - 2 టీ స్ఫూన్స్‌
ఉప్పు - రుచికి సరిపడినంత
పసుపు - చిటికెడు
చింతపండు - నిమ్మకాయంత
జిలకర, ఆవాలు, శనగ పప్పు, మినపప్పు - అన్నీ కలిపి ఒక టీ స్ఫూన్‌
బెల్లంపొడి - ఒక చిన్న కప్పు
నూనె - పోపు వేసుకోవడానికి తగినంత
ఎండుమిర్చి - నాలుగు

తయారు చేయు విధానం...
ముందుగా కాకరకాయలను గుండ్రని ముక్కలుగా కోసుకోవాలి. వాటి లో కొద్దిగా పసుపు, ఉప్పు, చింత పండు వేసి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా గట్టిగా వుండగానే దించుకొని నీటిని వార్చాలి. రెండు ఉల్లిపాయ లను కోసుకుని అందులో ఉప్పు, కారం వేసి మిక్సీ వేసుకోవాలి. అలాగే కొన్ని ఉల్లి పా యలను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. పొయ్యి మీద ఒక మందపాటి పాత్ర పెట్టి అందులో పోపుకు సరిపడా నూనె వేయాలి. కాగాక పోపు గింజలు, ఎండుమిర్చి వేసు కోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసి 10 నిమిషాల సేపు ఉంచాలి. ఉడికించుకున్న కాకర ముక్కలను ఈ మిశ్రమంలో వేసి మగ్గబెట్టుకోవాలి. పచ్చడి ముక్కలకు పట్టిన తరువా త బెల్లం పొడిని కలుపుకోవాలి. కొద్ది సేపు పొయ్యి మీద అలాగే వుంచాలి. నూనె పైకి తేలు తున్నట్లు వస్తుంది. ఇప్పుడు దించేసుకోవచ్చు. చపాతీ, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.

kariveకరివేపాకు రైస్‌
కావలసినవి...
రైస్‌ - ఒక చిన్న కప్పు
కరివేపాకు - రెండు రెబ్బలు
చింతపండు - కొద్దిగా
జిలకర - అర చెంచ
ఉప్పు - సరిపడినంత
పోపుకు - మినప్పప్పు,
శనగపప్పు, ఆవాలు కలిపి అర చెంచా
ఎండుమిర్చి - రెండు
నూనె - పొపుకు సరిపడినంత

తయారు చేయు విధానం...
పలుకుగా వండుకున్న అన్నాన్ని ఒక కప్పు తీసుకోవాలి. జిలకర, కరివేపాకును కొద్దిగా పెనం మీద వేసి వేడిచేసుకోవాలి. వీటిని చల్లార్చి కొద్దిగా చింత పండు, ఉప్పు కలిపి మిక్సీ వేసుకోవాలి. పొయ్యి మీద పాత్ర పెట్టి పోపుకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తరువాత పోపు గింజలు వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తరువాత అందులో మిక్సీ వేసుకున్న కరివేపాకు పొడిని కూడా కలుపుకోవాలి. రెండు నిమిషాల తరువాత అన్నాన్ని అందులో వేసి కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకుని కొద్దిగా వేసుకోవాలి. ఉదయం పూట టిఫిన్‌కి ఇది చాలా బాగుంటుంది. ఆరోగ్యానికీ మంచిది.








No comments:

Post a Comment