మెంతి పాలక్ పరోటా
కావల్సినవి:
100గ్రా. గోధుమ పిండి, 100గ్రా. ఓట్ మీల్, 100గ్రా పాలకూర, 100గ్రా. మెంతికూర, 100గ్రా. పనీర్, రెండు పచ్చి మిర పకాయలు, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, రుచికి ఉప్పు.
తయారీ:
పదార్థాలన్నింటినీ ఓ పాత్రలో వేసి తగినంత నీరుపోసి కలిపి, తడి వస్త్రం కప్పి ఓ అరగంట అలా వదిలేయాలి. పిండిని ఎనిమిది లేదా పది భాగాలుగా విభజించాలి. చపాతీ కర్రతో నొక్కుకోవాలి. పెనం పైన రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. వేడివేడిగా సాస్ లేదా ఇష్టమైన కూర నంజుకుని తింటే రుచిగా ఉంటుంది.
చికెన్ ఫ్రై
కావలసినవి:
చికెన్ : 1 కెజీ
నిమ్మకాయ : 1
కారం : తగినంత
ఉప్పు : తగినంత
పసుసు : చిటికెడు
కార్న్‌పౌడర్ : చిన్న కప్పు
మిఠాయిరంగు : చిటికెడు
మంచినూనె : వేయించడానికి సరిపడా
అల్లం వెల్లుల్లిపేస్టు :6 టీస్పూన్లు
కొత్తిమీర :2 కట్టలు
తయారుచేసే విధానం:
చికెన్‌ను బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్‌పౌడర్, నిమ్మకాయరసంలో చిటికెడు మిఠాయిరంగు వేసి ఒక గంటసేపు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత ఈ కలిపిన చికెన్ వేసి బాగా డీప్ ఫ్రై చెయ్యాలి.
అరటి కూర
కావల్సిన పదార్థాలు:
రెండు పచ్చి అరటికాయలు, ఒక టీస్పూన్ ధనియాలు, ఆరు ఎండు మిరపకాయలు, అరట ీస్పూన్ జీలకర్ర, ఎనిమిది మిరియాలు, ఒక్కోకప్పు కొబ్బరితురుము, కరివేపాకు అర టీస్ఫూన్ ఆవాలు, సాంబారు ఉల్లి పాయలు, బెల్లం తురుము, రుచికి ఉప్పు. ఐదు టేబుల్ స్పూన్ల నూనె.
తయారీ:
అరటికాయల చెక్కుతీసి అంగుళం పొడవు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. నీటిలో ఉడికించి పక్కన ఉంచుకోవాలి. మూకుడులో మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేడిచేసి ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరితురుము ఒకదాని తరువాత ఒకటిగా వేసి రంగు మారి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. చాలినంత నీరుపోసి రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. మూకుడులో మిగతా నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు వేసి తాలింపు పెట్టాలి. ఉల్లిపాయలు వేసి రంగుమారే వరకు వేయించాలి. అరటికాయ ముక్కలేసి 2 నిమిషాలు వేయించి రుబ్బిన పేస్టు, చింతపండు గుజ్జు, బెల్లం, తురుము, ఉప్పు, ఒకకప్పు నీరు కలపాలి. నీరింకా చిక్కబడే వరకు ఉడికించాలి. వేడివేడిగా వడ్డించాలి.
కిచిడీ
కావలసినవి:
బాస్మతి బియ్యం : 2 కప్పులు
పెసరపప్పు : 1 కప్పు
దాల్చిన చెక్క : 4 అంగుళాలు
లవంగాలు : 5
ఎండు మిరపకాయలు : 2
బే ఆకులు : 2
జీలకర్ర : 1 టేబుల్ స్పూన్
ఆవాలు :
1 టీస్పూన్
అల్లం వెల్లులి పేస్ట్:
1 టీస్పూన్
బఠాణీలు : 150 గ్రాములు
క్యారెట్ : 1
ఉల్లిపాయలు : 3
కారం : 1 టీస్పూన్
పసుపు : 1 టీస్పూన్
గరం మసాలా : 1 టీస్పూన్
నూనె : 2 టేబుల్ స్పూన్
నీరు : తగినంత
తయారు చేసే పద్దతి... బియ్యం, పప్పు కడిగి ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఒక పాత్రలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక, మిగతా సుగంధ దినుసులన్నీ వేయాలి.
కూరగాయ ముక్కలు, బఠాణీలువేసి వేయించి కొద్దిసేపు సెగ తగ్గించి వుంచాలి. బియ్యం, పప్పువేసి, పది నిమిషాలు వేయించి ఐదు కప్పుల నీరుపోసి, ప్రెషర్‌కుక్కర్‌లో మూడువిల్స్ వచ్చేవరకు ఉడికించి ఏదైనా ఊరగాయతో తింటే బాగుంటుంది.
No comments:
Post a Comment